Saturday, June 6, 2026
Google search engine

రామ్ దేవ్ బాబాను కలిసిన ఎంపీ కేశినేని శివనాథ్ – విజ‌యవాడ ఉత్సవ్ ఆహ్వానం

Must read

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఒక యాదృచ్ఛిక సంఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. మంగళవారం ఎంపీ కేశినేని శివనాథ్, ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ కలయికలో విజ‌యవాడ సాంస్కృతిక ఉత్సవం ప్రధాన చర్చాంశమైంది.

కేశినేని శివనాథ్, రామ్ దేవ్ బాబాకు విజ‌యవాడ ఉత్సవ్ వివరాలు తెలియజేశారు. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగబోయే ఈ ఉత్సవాన్ని “సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజ‌యవాడ” ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. దసరా మహోత్సవాల భాగంగా జరిగే ఈ వేడుకల్లో సంస్కృతి, సంప్రదాయం, ఆధ్యాత్మికత కలగలిపి పర్యాటకులు, భక్తులు, ప్రజలను ఆకట్టుకునేలా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారని వివరించారు.

ఎంపీ కేశినేని మాట్లాడుతూ, విజ‌యవాడ ఉత్సవ్ లక్ష్యం రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని దేశమంతటా పరిచయం చేయడమేనని అన్నారు. ఈ ఉత్సవం 11 రోజులపాటు కొనసాగుతుందని, ప్రతి రోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వేడుకలు ఉంటాయని వివరించారు.

రామ్ దేవ్ బాబా ఈ ఆహ్వానాన్ని ఎంతో ఆసక్తిగా విన్నారు. ఆయన సానుకూలంగా స్పందిస్తూ, “ఉత్సవంలో ఒకరోజు తప్పక హాజరవుతాను” అని హామీ ఇచ్చారు. దీంతో ఈ సారి విజ‌యవాడ ఉత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా యోగా గురువు రామ్ దేవ్ బాబా హాజరు కానున్నారని చెప్పొచ్చు.

ఇప్పటికే దసరా సందర్భంగా విజయవాడలో జరిగే ఉత్సవాలు జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందాయి. కనకదుర్గమ్మ ఆలయం వద్ద జరిగే మహోత్సవాలు లక్షలాది భక్తులను ఆకర్షిస్తుంటాయి. ఈ సందర్భంలో జరుగబోయే విజ‌యవాడ ఉత్సవ్ రాష్ట్ర ప్రతిష్ఠను మరింతగా పెంచనుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!