Friday, June 26, 2026

జన్మదినాన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ప్రారంభించిన కేటీఆర్

Must read

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) తన జన్మదినాన్ని పద్దతిగా, కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర రావు (కేసీఆర్) దంపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. భార్య శైలిమ, కుమారుడు హిమాన్షుతో కలిసి సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కేటీఆర్, తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు. శైలిమ కూడా అత్తమామలకు నమస్కరించి, వారి ఆశీస్సులు పొందారు.

ఈ సందర్భంగా కేసీఆర్ దంపతులు కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆశీర్వదించారు. పాదాభివందనం చేసిన కేటీఆర్ దంపతుల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అభిమానులు, కార్యకర్తలు ఈ దృశ్యాన్ని ఎంతో భావోద్వేగంతో పంచుకుంటున్నారు.

తెలంగాణ భవన్‌లో ఘనంగా వేడుకలు

కేటీఆర్ జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్‌ వేదికగా గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కేటీఆర్ స్వయంగా కేక్ కట్ చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌ ప్రాంగణం నినాదాలతో మార్మోగిపోయింది. కేటీఆర్ వాహనం దిగుతుండగానే కార్యకర్తలు “సీఎం… సీఎం…” అంటూ ఉత్సాహంగా నినాదాలు చేశారు. వారి ప్రేమాభిమానాలకు కేటీఆర్ చేతులెత్తి అభివాదం తెలిపారు.

ఇటీవల కాలంలో రాజకీయ మార్పుల నేపథ్యంలో కేటీఆర్‌పై కార్యకర్తల అంచనాలు, నమ్మకాలు స్పష్టంగా వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా పలువురు నేతలు కేటీఆర్ నాయకత్వ లక్షణాలను కొనియాడుతూ, రాష్ట్రానికి ఆయన అవసరమయ్యే నేతగా అభివర్ణించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!