Friday, June 26, 2026

ఉప్పల్‌ను రాష్ట్రంలో నెంబర్‌వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

Must read

ఉప్పల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

గురువారం కమల నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో కాప్రా డీసీ జగన్ అధ్యక్షతన బోనాల పండుగ నేపథ్యంలో నిర్వహించిన అన్ని విభాగాల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ప్రతి శాఖ అధికారి తమ పరిధిలోని డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉండాలని సూచించారు. సమన్వయంతో పనిచేస్తేనే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.

అధికారుల సమిష్టి పాత్రపై దృష్టి
ఈ సమీక్ష సమావేశంలో నాచారం-మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి, జెన్ శేఖర్, ఏసిపిలు చక్రపాణి, వెంకట్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఈఈ నాగేందర్, వాటర్ వర్క్స్ ఎండి సంతోష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!