Friday, June 26, 2026

పారిశుద్ధ్య సిబ్బందికి రక్షణ కిట్ల పంపిణీ

Must read

ఉప్పల్ నియోజకవర్గంలోని చిలుకనగర్ డివిజన్‌లో జీహెచ్ఎంసి పారిశుద్ధ్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి, చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్, మహిళా నాయకురాలు డి. చందన నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమిస్తున్నారనీ, వారి సేవలు అభినందనీయమైనవని పేర్కొన్నారు. “వారు చేసే సేవకు ఎంత పెద్ద గౌరవం, ఎంతటి సత్కారం చేసినా తక్కువే. ఒక రోజు శానిటేషన్ సిబ్బంది పనిచేయకపోతేనే నగరం హస్తవ్యస్తంగా మారిపోతుంది. అందుకే వారిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదీ” అని వారు అన్నారు.

కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నేతలు, శానిటేషన్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం సజావుగా సాగింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!