Friday, June 26, 2026

ఉజ్జయినీ బోనాల సందర్భంగా మొండా మార్కెట్‌లో ప్రత్యేక పూజలు చేసిన ఈటల

Must read

ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర సందర్భంగా మొండా మార్కెట్ డివిజన్‌లో నిర్వహించిన ప్రత్యేక బోనాల కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్పొరేటర్ దీపిక నరేష్ ఆధ్వర్యంలో కీస్ హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఈటల రాజేందర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈటల మాట్లాడుతూ, “తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్లో బోనాల ఉత్సవాలకు విశిష్ట స్థానం ఉంది. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించాం,” అని తెలిపారు.
కార్పొరేటర్ దీపిక నరేష్ మాట్లాడుతూ, “ప్రతి ఏడాది బోనాల జాతరను వైభవంగా నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొనడం మాకు గౌరవంగా భావిస్తున్నాం,” అని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు. బోనాల సందర్భంగా స్థానిక కళాకారులు నృత్యాలు చేసి అందరిని ఆకట్టుకున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!