Friday, June 26, 2026

కీర‌వాణి ఇంట తీవ్ర విషాదం

Must read

ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ విజేత ఎం.ఎం. కీరవాణి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, సినీ గేయ రచయితగా ప్రసిద్ధి పొందిన శివశక్తి దత్త (వయస్సు 92) మంగళవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

శివశక్తి దత్త కేవలం కీరవాణికి తండ్రిగానే కాకుండా, తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ రచయితగా, స్క్రీన్ రైటర్‌గా తనదైన స్థానం ఏర్పరుచుకున్నారు. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘చత్రపతి’, ‘సై’, ‘రాజన్న’, ‘హనుమాన్’ వంటి విజయవంతమైన చిత్రాలకు ఆయన కలం నడిపారు. ఇతని రచనలు భావోద్వేగానికి, భాషా పరిమితులకు కొత్త నిర్వచనాలను ఇచ్చాయి. పలుచిత్రాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా కూడా ఆయన విశేష కృషి చేశారు.

శివశక్తి దత్త ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి పెద్దనాన్న. రాజమౌళి తండ్రి, కథా రచయిత వి. విజయేంద్ర ప్రసాద్‌కు శివశక్తి దత్త సోదరుడు కావడం గమనార్హం. ఈ కుటుంబానికి తెలుగు సినిమా పట్ల ఉన్న ఆకాంక్ష, అభిమానం ఆయనే ఆద్యుడు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

శివశక్తి దత్త మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు, గేయ రచయితలు, దర్శకులు, అభిమానులు తీవ్రంగా స్పందించారు. ఆయన మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎన్నో రచనలతో సినీ ప్రపంచాన్ని మెప్పించిన శివశక్తి దత్త ఇకలేరు అన్న వాస్తవాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!