Friday, June 26, 2026

మల్కాజ్గిరిలో రూ.46 లక్షల అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శ్రవణ్ శ్రీకారం

Must read

మల్కాజ్గిరి డివిజన్‌లో అభివృద్ధి కార్యాచరణకు వేగం పెంచుతూ, కార్పొరేటర్ శ్రవణ్ గురువారం దాదాపు రూ.46 లక్షల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా రూ.8 లక్షలతో వెస్ట్ శ్రీకృష్ణనగర్‌లో స్టోర్మ్ వాటర్ డ్రైన్ నిర్మాణం, రూ.35 లక్షలతో భ్రమరాంబికా నగర్‌లో సీసీ రోడ్ రిస్టోరేషన్ పనులను ప్రారంభించారు. అధికారులు, కాలనీవాసులతో కలిసి ఈ కార్యక్రమాలను నిర్వర్తించారు.

అదే విధంగా కృపా కాంప్లెక్స్, శ్రీకృష్ణనగర్, కృష్ణనగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ శ్రవణ్ మాట్లాడుతూ, “మల్కాజ్గిరి డివిజన్‌లో సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఇప్పటికే కోట్లాది రూపాయలతో పనులు చేపట్టాం. మిగిలిన అవసరాలపై నివేదికలు అందితే త్వరితగతిన చర్యలు తీసుకుంటాం,” అని పేర్కొన్నారు.

ఇక, బోనాల పండుగను పురస్కరించుకుని డివిజన్ పరిధిలో బోనాల దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు నేరుగా తనను సంప్రదించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రాజు, మెడికల్ ఆఫీసర్ మంజుల, వాటర్ వర్క్స్ అధికారుడు నవీన్, ఇంజనీరింగ్ ఏఈలు నవీన్, రమేష్, సానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్, ఇతర సిబ్బంది నందు, సంజీవ్, నాని, రామకృష్ణ, శ్రీనివాస్, వెంకటేష్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!