ఈవెంట్ జెన్ సమర్పణలో డెనిమ్ ఫిట్నెస్ మిస్టర్ హైదరాబాద్ రిప్పిడ్ మోడలింగ్ షో, బాడీ బిల్డింగ్, ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్, న్యూ ప్రోగ్రాం లాంచ్ కార్యక్రమానికి గెస్ట్ ఆఫ్ ఆనర్ గా మిర్యాలగూడకు చెందిన సోషల్ వర్కర్, ప్రొడ్యూసర్ మూసా అలీఖాన్ విచ్చేయనున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు సయ్యద్ అమీర్, పూజ గుప్తా నుంచి ప్రత్యేక ఆహ్వానం మూసా అలీఖాన్ కు అందింది.
రాబోయే రోజుల్లో దుబాయ్ అమెరికా వంటి దేశ విదేశాలలో సైతం భారీ ఈవెంట్స్ చేయనున్నారు.
ఫిబ్రవరి 12వ తేదీన హైదరాబాదు బంజారాహిల్స్ లోని తాజ్ బంజారా హోటల్ లో మిస్టర్ హైదరాబాద్ ప్రోగ్రాం గ్రాండ్ గా జరగనుంది. ఈవెంట్ జెన్ నిర్వాహకులు నిర్వహించే ప్రతి వేడుక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. తాజ్ బంజారాలో
నిర్వహించే ఈ కార్యక్రమానికి మూసా అలీ ఖాన్ కు ఆహ్వానం అందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గెస్ట్ ఆఫ్ ఆనర్ గా ఆహ్వానం అందుకున్న మూసా అలీఖాన్ మీడియాతో మాట్లాడుతూ తనను ఎంతో ప్రేమ పూర్వకంగా ఆహ్వానించిన ఈవెంట్ జెన్ డ్రీమ్ ఆర్గనైజేషన్ చైర్మన్ మిస్టర్ మగ్ధూమ్ వసీం, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సయ్యద్ అమీర్, కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ పూజగుప్తాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి భారీ వేడుకకు స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్న కంపెనీల నిర్వాహకులకు మూసా అలీఖాన్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మూసా అలీఖాన్ తో పాటు రాజకీయ ప్రముఖులు, సినీ నటీ నటులు, సామాజిక సేవకులు , బాడీ బిల్డర్స్, మోడల్స్ తో పాటు తదితరులు పాల్గొనన్నారు. ప్రముఖ ఛానెల్స్ మీడియా పార్టనర్స్ గా వ్యవహరించనున్నారు.
ఈ వేడుకకు అందరూ ఆహ్వానితులే.