ఓటిటి లో' బలగం'
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ ను సొంతం చేసుకున్న వాటిలో 'బలగం' ఒకటిగా కనిపిస్తుంది. కమెడియన్ వేణు ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించారు . దర్శకుడిగా ఆయన వైపు నుంచి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉండేవి కాదు. కానీ దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఈ సినిమా రావడంతో, కంటెంట్ లో విషయం ఉండొచ్చని కొంతమంది భావించారు.
ఈ నెల 3వ తేదీన విడుదలైన ఈ సినిమా, మౌత్ టాక్ తో నిదానంగా వసూళ్లను పెంచుకుంటూ వెళుతూ హిట్ టాక్ ను సంపాదించుకుంది. అలాంటి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ రోజున స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా నిన్న వార్తలు వచ్చాయి. సినిమా విడుదలైన 20 రోజుల్లోనే ఎలా ఓటీటీకి వస్తుందనే అనుమానాలు రేకెత్తాయి. పైగా ఈ విషయాన్ని ఖరారు చేస్తూ ట్రైలర్ గానీ .. స్ట్రీమింగ్ డేట్ పోస్టర్ గాని రాలేదు.
దాంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో వస్తుందా .. లేదా అనే సందేహాలు తలెత్తాయి. కానీ నిన్న రాత్రి 12 గంటల నుంచే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో కొనసాగుతూనే ఉంది. ఇంత తక్కువ సమయంలో ఈ సినిమా ఓటీటీలో రావడం ఆశ్చర్యమే.
Share this article in your network!