రైతన్నలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతన్నలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది
ఇవాళ ఏపీ వ్యవసాయ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ…
ఇతర రాష్ట్రాల్లో ఎరువులు, విత్తనాల కొరత ఉందేమోగానీ ఏపీ లో కొరత లేదని వెల్లడించారు. రైతు సంక్షేమ కోసం ప్రభుత్వం బీమా సొమ్ము రూ.2,500 కోట్లు చెల్లిస్తుందని ప్రకటన చేశారు మంత్రి కన్నబాబు.
E-క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు నేరుగా పథకాలు వర్తిస్తున్నాయన్నారు. పంట పెట్టుబడి కోసం రైతుల ఖాతాల్లోనే నేరుగా నగదు జమఅవుతోందని మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. దేశంలో వ్యవసాయంలో ఏపీ అగ్రగామిగా ఉందని కేంద్రం ప్రకటించిన నాటినుంచి బాబు బురదజల్లే కార్యక్రమం మొదలుపెట్టారని ఫైర్ అయ్యారు. విత్తనాల నుంచి విక్రయాల దాక, పెట్టుబడి నుండి పంట అమ్ముకునే వరకు రైతును ప్రభుత్వం చేయి పట్టి నడిపిస్తోందని తెలిపారు మంత్రి కన్నబాబు.జగన్ సర్కార్ రైతుల కోసం మాత్రమే పని చేసే ప్రభుత్వమని.. తెలుగు దేశం ప్రభుత్వ హాయంలో రైతులు చాలా కష్టాలు చవి చూసారని మండిపడ్డారు.
Share this article in your network!