ఏపీలో ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. సామజిక సమీకరణాలు, మహిళా కోటాను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు సీఎం జగన్. 

నిన్న సీఎం జగన్ అద్యక్షతన వైఎస్‌ఆర్‌సిపి ఎల్‌పి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు , ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలకు జగన్ హిత బోధ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రజల్లో ఉండాలని ఆదేశించారు జగన్. ఉగాది సందర్భంగా మంత్రివర్గ విస్తరణ జరగనుందని ఇండికేషన్స్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కొత్తవారిని క్యాబినెట్ లోకి తీసుకునేందుకుగాను మార్చి 27న మంత్రులు రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని మినహా మిగతా మంత్రులంతా రాజీనామా చేసే అవకాశం ఉంది. అయితే, మంత్రి పదవుల నుంచి తప్పించిన నేతలకు పార్టీ పదవులను కట్టబెట్టనున్నారు.
ఉగాది తరువాత 25కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో ఎక్కువ సంఖ్యలో మంత్రులు నామినేట్ అవ్వనున్నారు. అయితే , మరోసారి హోంమంత్రి గా మహిళా నేతకే బాధ్యతలు కట్టబెట్టే అవకాశం ఉంది.