నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు. ఈరోజు ఆయన 73వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు. 

'శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారు కలకాలం సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, అలా ఆశీర్వదించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు. దీంతోపాటు గతంతో చంద్రబాబుతో కలిసి దిగిన పాత ఫొటోను షేర్ చేశారు.