ఏపీ పరిస్థితులపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌, మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో కరెంట్‌, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారన్నారు. ఏపీతో పోలిస్తే..తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు.