జనసేనాని తిక్కకు లెక్కలు మారుతున్నాయా..? గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను రిపీట్ కానివోద్దని డిసైడ్ అయ్యారా..?పొత్తులపై ఎత్తులు వేస్తూ… జనాల అటెన్షన్ ను తనవైపు మల్లించుకుంటున్నారా..? వచ్చే ఎన్నికల్లో గెలిచి వైసీపీ నేతల డైలాగ్ వార్ కు చెక్ పెట్టాలని తలపోస్తున్నారా..? ఇందుకోసం మళ్ళీ రెండు చోట్ల పోటీ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. 

పవన్ కళ్యాణ్ తన ఫోకస్ ను రాయలసీమపై పెట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ నుంచి పోటీ చేయాలనీ భావిస్తున్నారట. పవన్ పై విమర్శలు చేయాల్సి వచ్చిన ప్రతిసారి మొదట ఎమ్మెల్యేగా ఎన్నికవ్వు అని హేళనగా మాట్లాడుతోన్న వైసీపీ నేతల డైలాగ్ వార్ కు చెక్ పెట్టాలంటే వచ్చే ఎన్నికల్లో గెలిచి, నోరు మూయించాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు పవన్. ఇందుకోసం రెండు చోట్ల పోటీ చేయాలనీ డిసైడ్ అయ్యారట. 

గతంలో భీమవరం, గాజువాక రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన పవన్.. పోటీ చేసిన రెండు చోట్ల దారుణంగా ఓటమి పాలయ్యారు. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసేందుకు వైసీపీకి ఆయుధంగా మారింది. ప్రజాబలం నీవు మాట్లాడుతావా అంటూ కౌంటర్లు పేలుతున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెప్తే బాగుంటుంది కాని, రాజకీయాల్లో అంత ఈజీ కాదంటూ విమర్శలు చేయడం కంటిన్యూ అవుతోంది. ఈ విమర్శలకు తన గెలుపుతోనే సమాధానం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు జనసేనాని. ఇందులో భాగంగా.. ఆయన సీమ నుంచి ఈస్ట్ నుంచి రెండు చోట్ల పోటీ చేయాలనీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

రాయలసీమలో వైసీపీకి మంచి పట్టుంది. అక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించి తన గెలుపు సాధారణం కాదు… చరిత్రాత్మకం చేయాలనీ జనసేనాని భావిస్తున్నారాట. ఇందుకోసం.. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని అసెంబ్లీకి పంపిన తిరుపతి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారట. తిరుపతిలో జనసేనకు బాగానే ఓటు బ్యాంక్ ఉంది. అలాగే , మెగా అభిమానులు భారీగా ఉండటంతో.. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో… తిరుపతిలో పవన్ కళ్యాణ్ గెలిస్తే… అది వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. 

ఇక, కాకినాడ రూరల్ నుంచి కూడా పోటీ చేయాలనీ అనుకుంటున్నారట పవన్. ఇక్కడి నుంచి గతంలో ప్రజారాజ్యం ఎమ్మెల్యేగా గెలిచి మొదటి సారి చట్టసభాల్లోకి వెళ్ళిన కురసాల కన్నబాబు ప్రస్తుతం వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది కూడా పవన్ కళ్యాణ్ కు కలిసొచ్చె అంశమని తెలుస్తోంది. ఈ రెండో నియోజకవర్గాల్లో పోటీ చేసి సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఒకవేల టీడీపీతో పొత్తు కుదిరినప్పటికీ కూడా ఈ రెండు సీట్లపై పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గే అవకాశం లేదని టాక్. చూడాలి మరి ఎం జరుగుతుందో