ప్రత్యేక ఆకర్షణగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ డ్యాన్స్
సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ముఖ ద్వారాలు పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి.
మహంకాళి అమ్మవారికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులు బంగారు బోనంతో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పోతరాజుల వీరంగాల మధ్య మంత్రి తలసాని కూడా వారితో కలిసి డాన్స్ చేయడం ఇక్కడికి తరలి వచ్చిన వారు సంతోషంగా తిలకించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోనాలతో మహిళల నృత్యాలు, పోతురాజులు, కొలాటం ప్రదర్శనలు అలరించాయి. మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, చైర్మన్‌లు దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Share this article in your network!