ఈ వారం థియేటర్లలో సందడి.. తెలుగు, హిందీ, పంజాబీ, హాలీవుడ్ సినిమాల జాతర

Date:

Theatrical Releases This Week Haiwaan Sardar 2 Epic And More Movies

ఈ వారం సినీ ప్రేక్షకులకు వినోదం పంచేందుకు పలు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. తెలుగు, హిందీ, పంజాబీతో పాటు హాలీవుడ్ నుంచి కూడా యాక్షన్, థ్రిల్లర్, కామెడీ, లవ్ స్టోరీ, పౌరాణిక మిస్టరీ వంటి విభిన్న జానర్‌ల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ముఖ్యంగా సెప్టెంబర్ 10, 11 తేదీల్లో వరుసగా పలు సినిమాలు విడుదల కానుండటంతో ఈ వీకెండ్ మూవీ లవర్స్‌కు స్పెషల్‌గా మారనుంది.

హైవాన్ (Haiwaan)

బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ సుమారు 18 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ హైవాన్. దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళ హిట్ మూవీ ‘ఒప్పం’కు రీమేక్‌గా రూపొందింది. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్ చూపులేని మార్షల్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించనుండగా.. అక్షయ్ కుమార్ క్రూరమైన సైకో కిల్లర్‌గా నటించారు. ఓ చిన్నారిని కాపాడేందుకు బ్లైండ్ మార్షల్ ఆర్టిస్ట్ చేసే పోరాటం చుట్టూ కథ సాగుతుంది.

సింగ్ వర్సెస్ కౌర్ 2

పంజాబీ స్టార్ గిప్పీ గ్రెవాల్, షెహనాజ్ గిల్ జంటగా నటించిన సింగ్ వర్సెస్ కౌర్ 2 కూడా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. నవనియాత్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2013లో వచ్చిన ‘సింగ్ వర్సెస్ కౌర్’కు సీక్వెల్. కెనడా, పంజాబ్ నేపథ్యాల్లో సాగే రొమాంటిక్ కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. పెళ్లి చుట్టూ జరిగే సరదా సంఘటనలు, అపార్థాలతో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమవుతోంది.

ఫాల్ 2: డెడ్ పాయింట్

2022లో విడుదలై ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన సర్వైవల్ థ్రిల్లర్ ఫాల్కు సీక్వెల్‌గా ఫాల్ 2: డెడ్ పాయింట్ వస్తోంది. సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రంలో గత ప్రమాదంలో తన సోదరిని కోల్పోయిన జ్యాక్స్.. థాయ్‌లాండ్‌లోని అత్యంత ప్రమాదకరమైన పర్వతాన్ని అధిరోహించేందుకు బయలుదేరుతుంది. అనూహ్య వాతావరణ పరిస్థితుల కారణంగా కొండపై చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి బయటపడేందుకు ఆమె చేసే పోరాటమే కథ.

ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్

తెలుగులో ‘బేబీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్. ‘#90s’ వెబ్ సిరీస్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. లండన్‌లో చదువుకునే మధ్యతరగతి తెలుగు యువకుడి జీవితంలో చోటుచేసుకునే ప్రేమ, బ్రేకప్, కుటుంబ భావోద్వేగాల చుట్టూ ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా సాగుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

మహేంద్రగిరి వారాహి

హీరో సుమంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఆధ్యాత్మిక పౌరాణిక మిస్టరీ థ్రిల్లర్ మహేంద్రగిరి వారాహి కూడా సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాచీన దైవిక రహస్యాల నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సర్దార్ 2

తమిళ స్టార్ కార్తీ నటిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్ 2 సెప్టెంబర్ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కింది. మొదటి భాగానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సీక్వెల్‌పై కార్తీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మారెమ్మ

రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ భూపతిరాజు హీరోగా పరిచయం అవుతున్న చిత్రం మారెమ్మ. మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 10న థియేటర్లలోకి రానుంది. పల్లెటూరి నేపథ్యంలోని కథ, యాక్షన్ అంశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేయనుంది.

మందాడి

వర్సటైల్ యాక్టర్ సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన వినూత్న యాక్షన్ ఎంటర్‌టైనర్ మందాడి కూడా సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమాపై సుహాస్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

శుభకార్యాల సమాచారం హిజ్రాలకు ఎలా తెలుస్తుంది?.. ఇంటర్వ్యూలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు

పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు జరిగే ప్రదేశాలకు కొంతమంది హిజ్రా వ్యక్తులు...

కనకదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో సుస్మిత కొణిదెల.. ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియామకం!

మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి మరో కీలక అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. చిరంజీవి...

‘డీఎస్సీ స్కాం’పై సీబీఐ విచారణకు ఎందుకు భయం?: శ్యామల

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ వ్యవహారం రాజకీయ వేడిని పెంచుతోంది. డీఎస్సీలో అన్యాయం జరిగిందంటూ...

మహిళా పోలీసులను పరామర్శించిన మంత్రి సీతక్క..

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం చోటుచేసుకున్న ఉద్రిక్త ఘటనలో గాయపడిన మహిళా...
error: Content is protected !!