- రాష్ట్రంలో కోటికిపైగా ఫ్యామిలీలకు రూ.5 లక్షల బీమా
- రేషన్ కార్డు ఉన్నా లేకున్నా అప్లయ్ చేసుకోవచ్చు
- ఎవరు అర్హులు? అర్హతలు, దరఖాస్తు విధానం ఎలాగంటే?
రేషన్ కార్డు లేకున్నా దరఖాస్తు చేయొచ్చా? :
ఈ పథకంలో రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. అలాంటి వారు ప్రత్యేక దరఖాస్తు ఫారం, ప్రత్యేక కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర జిల్లాల్లో రేషన్ కార్డు ఉన్నవారు కూడా తమకు దగ్గర్లోని రిజిస్టర్ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అందుకే రేషన్ కార్డు లేదని అర్హులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
ఎలా అప్లయ్ చేసుకోవాలి? :
గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వం ప్రత్యేక నమోదు శిబిరాలను ఏర్పాటు చేయనుంది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, పట్టణాల్లో వార్డు అధికారులు నమోదు ప్రక్రియను పర్యవేక్షిస్తారు. దరఖాస్తు సమయంలో బీమా పొందే వ్యక్తి ఆధార్ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, నామినీ వివరాలు అందించాలి.
నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. అర్హులైన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి.. దరఖాస్తు చేసే సమయంలో నామినీ వివరాలు, ఒకరి కన్నా ఎక్కువ మంది నామినీలు ఉంటే పరిహారం పంపిణీ విధానం గురించి కూడా ముందుగానే తెలుసుకోవడం బెటర్..


