- ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి గుడ్ న్యూస్..
- నకిలీ డిస్కౌంట్ల ఆటకు ఇక చెక్
- ఆన్లైన్ షాపింగ్‌లో భారీ మార్పులు..
- జనవరి 1 నుంచి కొత్త రూల్స్
స్పాన్సర్డ్ లేబుల్ తప్పనిసరి :
అలాగే సెర్చ్ చేసినప్పుడు కనిపించే పెయిడ్ ప్రమోషన్ వస్తువులకు స్పాన్సర్డ్ అనే లేబుల్ తప్పనిసరిగా చూపించాలి. దీంతో ఏది సాధారణ ప్రొడక్ట్, ఏది ప్రకటన ద్వారా ముందుకు తీసుకొచ్చిన వస్తువో సులభంగా గుర్తించవచ్చు.
మరోవైపు రీఫండ్లు, రిటర్నులు, ఆర్డర్ క్యాన్సిలేషన్ల విషయంలోనూ పారదర్శకత ఉండాలి. ఇందుకోసం కంపెనీలు నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌తో అనుసంధానం కావాలి. వస్తువుల గడువు తేదీ, డెలివరీ సమయం, వారంటీ, గ్యారంటీ వివరాలు కూడా స్పష్టంగా అందించాలి.
డార్క్ ప్యాటర్న్స్‌కు స్వస్తి :
కస్టమర్లకు తెలియకుండానే అదనపు ఖర్చులు పెట్టించే డార్క్ ప్యాటర్న్స్‌కు కూడా స్వస్తి చెప్పాల్సి ఉంటుంది. అంతేకాదు, ఈ-కామర్స్ సంస్థలు తమ ప్లాట్‌ఫామ్స్‌పై వార్షిక ఆడిట్ నిర్వహించడంతో పాటు నిబంధనలు పాటిస్తున్నట్లు ధ్రువీకరణ పత్రాన్ని ప్రదర్శించాలి.
మొత్తానికి ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే ఆన్లైన్ షాపింగ్‌లో పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. ఆఫర్ల పేరుతో మోసపోకుండా, తమ డబ్బుకు తగిన విలువ పొందేందుకు వినియోగదారులకు ఉపయోగపడనుంది.


