Saturday, June 6, 2026
Google search engine

రైతు డిస్కమ్ పై పబ్లిక్ హియరింగ్ లో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

Must read

రైతు డిస్కం పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తోందని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ డిస్కమ్ ఏర్పాటు వ్యవసాయంపై ఎండ్రిన్ చల్లడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు డిస్కమ్ ఏర్పాటుపై తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ శుక్రవారం ఎర్రగడ్డలోని సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ లో కవిత పాల్గొని మాట్లాడారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రైతులకు మంచి చేసే ఆలోచనలో ఉంటే ఆరు నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు దాచి ఉంచిందో చెప్పాలన్నారు. యావత్ తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసే ప్రయత్నాలను మానుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే 1999 నాటి కాల్పుల ఘటనను కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ రైతుల భవితవ్యాన్ని నిర్ణయించే ఈ అంశంపై 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏ విధంగానూ వయిబుల్ కాని ఈ ప్రపోజల్ ను తిరస్కరించాలని ఈఆర్సీకి విజ్ఞప్తి చేశారు.

రైతు డిస్కం కారణంగా మేలు జరగకపోగా రైతులకు మరింత నష్టం వాటిల్లుతుందని కవిత అన్నారు. కొత్త డిస్కం కు 42 శాతం లోడ్ ట్రాన్ ఫర్ చేస్తామని ప్రభుత్వం చెబుతోందని… కానీ అందుకు తగిన విధంగా ఉద్యోగులను మాత్రం కేటాయించటం లేదన్నారు. మొత్తం డిస్కం లలో 45 వేల మంది ఉద్యోగులు ఉంటే కొత్త డిస్కం కుి 2 వేల మంది ఉద్యోగులను మాత్రమే ట్రాన్స్ ఫర్ చేస్తామంటున్నారన్నారు.

దీని కారణంగా ట్రాన్స్ ఫార్మర్లు రిపేర్ వస్తే రెండు నెలల పాటు ఎదురుచూసే పరిస్థితి ఉంటుందన్నారు. పైగా ఇంతకు ముందు నియోజకవర్గ కేంద్రంలో ట్రాన్ ఫార్మర్ రిపేర్ సెంటర్ ఉంటే ఇప్పుడు అది తాలుకాకు మారే పరిస్థితి ఉంటుందన్నారు. దీంతో రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. తెలంగాణలో 29 లక్షల బోర్లు ఉన్నాయని ఈ కొత్త డిస్కం కారణంగా ఆయా బోర్ల పరిస్థితి డోలాయామనంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

డిస్కమ్ ల పరిస్థితి బాగాలేదని ప్రభుత్వమే చెబుతోందని కవిత గుర్తు చేశారు. మన డిస్కమ్ లకు మైనస్ సీ రేటింగ్ ఉందని అంటున్నారని కానీ దానికి ఈ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. డిస్కం ల బకాయిలు రూ. 69 వేల కోట్లు ఉంటే అందులో 54 వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం నుంచే రావాల్సి ఉందన్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లిస్తే మన డిస్కమ్ లు మంచి రేటింగ్ లలోకి వస్తాయని చెప్పారు. పైగా కొత్త డిస్కం కు యూనిట్ 6 రూపాయలు ఖర్చయ్యే థర్మల్ విద్యుత్ ను కేటాయిస్తున్నారని చెప్పారు.

రైతు డిస్కం వద్దే వద్దంటే అందులో ఆంధ్రా ఉద్యోగులకు పెత్తనం కట్టేబెట్టే ప్రయత్నం చేస్తున్నారని కవిత అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటలు కరెంట్ వచ్చేందుకు తెలంగాణ ఉద్యోగులు కష్టపడితే వారికే కష్టమొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 12 వందల మంది తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు నష్టం చేశారని చెప్పారు. అదే సమయంలో ఆంధ్రా నుంచి మన వద్దకు వచ్చిన 17 వందల మంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు. విభజన చట్టాలను పక్కన పెట్టి ఫోర్స్ ఫుల్ గా ఆంధ్రా ఉద్యోగులను మనకు ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికే జెన్ కో, రెడ్ కో, సదరన్ డిస్కమ్ ఇలా అన్నింట్లో ఆంధ్రావాళ్ల పెత్తనమే ఉందన్నారు. తెలంగాణ డిస్కమ్ లలో ఆంధ్రావాళ్ల పెత్తనం ఉండొద్దని కవిత కోరారు. రైతు డిస్కం తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సి వస్తే అందులో తెలంగాణ వాళ్లే ఉండాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రైతాంగం భవిష్యత్ ను నిర్ణయించే ఈ అంశాన్ని ఏసీ రూముల్లో కూర్చొని నిర్ణయించటం సరికాదని కవిత అన్నారు. తెలంగాణలోని 33 జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని ఈఆర్సీని కోరారు. ఈఆర్సీ నుంచి ఎలాంటి అనుమతి రాకుండానే జూన్ 2 నుంచి కొత్త డిస్కం పని ప్రారంభమవుతుందని సీఎం మాట్లాడటం సరికాదని చెప్పారు. రైతు డిస్కం విషయంలో ముందు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని కోరారు. గతంలో ఎనర్జీ అడిట్ స్కీమ్ లు ఎప్పుడు కూడా సక్సెస్ కాలేదని కవిత గుర్తు చేశారు. అందుకే ముందు పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలన్నారు. లేదంటే పెద్ద మొత్తంలో ఉన్న రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించారు. కొత్త డిస్కమ్ కారణంగా కొత్తగా ఎక్కువ గంటలు కరెంట్ ఇస్తారా? ఇప్పుడున్న డిస్కమ్ లో సమస్యలను పరిష్కరించుకుంటే సరిపోయేదానికి ఎందుకు కొత్త డిస్కమ్ అని కవిత ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో వాయెబుల్ కానీ ఈ ప్రపోజల్ ను ఈఆర్సీ రిజెక్ట్ చేయాలని కవిత కోరారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!