Saturday, June 6, 2026
Google search engine

ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేయడానికి చర్యలు : మంత్రి సీతక్క

Must read

మహిళా సాధికారతకు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోందని. ముఖ్యంగా మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్లను బలోపేతం చేయడానికి పలు చర్యలను అమలు చేస్తోందని. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక చేపట్టిన గృహ నిర్మాణ పథకమైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కింద నిర్మిస్తున్న ఇండ్లకు అవసరమైన ఇటుకలను మహిళా సంఘాల నుంచే కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యతో మహిళా సంఘాలకు స్థిరమైన మార్కెట్ లభించడంతో పాటు ఆదాయం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఈ కార్యక్రమంపై స్పందించిన మంత్రి సీతక్క మాట్లాడుతూ, మహిళా సంఘాల ఇటుక యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయని ఆమె తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ఈ యూనిట్లు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయని ఆమె వివరించారు.

సిద్ధిపేటకు చెందిన కుంట మల్ల వాణి విజయగాథ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె నిర్వహిస్తున్న ఇటుక తయారీ యూనిట్ నెలకు సుమారు ₹57 వేల నికర లాభాన్ని ఆర్జిస్తూ విజయవంతంగా కొనసాగుతోందని. సరైన ప్రోత్సాహం, కృషి ఉంటే మహిళలు ఏ రంగంలోనైనా రాణించగలరని ఈ ఉదాహరణ స్పష్టంగా చేసి చూపిందని అధికారులు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 736 మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఇటుక తయారీ యూనిట్లు ఉన్నప్పటికీ, అవి పూర్తి సామర్థ్యంతో పనిచేయడం లేదని. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందన్నారు. ఈ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ఆధునిక యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు ఆర్థిక సహాయం కూడా అందిస్తోందని అధికారులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన (పీఎంఈజీపీ) ద్వారా మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభిస్తోందని. ఈ పథకం కింద 35 శాతం సబ్సిడీతో రుణాలు అందిస్తూ యూనిట్లను అప్‌గ్రేడ్ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారు. దీంతో మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగుతున్నార అధికారులు సంతోషాన్ని వ్యక్త పరిచారు. .

మహిళా సంఘాల ఈ యూనిట్లు కేవలం ఉపాధి కల్పనకే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక మార్పులకు దారితీస్తున్నాయని. కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడటంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి వేగవంతమవుతోంది. మహిళలు ఆర్థికంగా బలపడటం ద్వారా సమాజంలో వారి స్థానం మరింత బలపడుతోందని మంత్రి సీతక్క తెలిపారు

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!