వినాయకనగర్ డివిజన్‌లో చేపట్టాల్సిన అత్యవసర అభివృద్ధి పనులకు సంబంధించి బడ్జెట్ మంజూరు చేయాలని వినాయకనగర్ డివిజన్ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి కోరారు.ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా GHMC జోనల్ కమిషనర్‌ను కలసి, వినాయకనగర్ డివిజన్‌లో చేపట్టవలసిన అభివృద్ధి పనులకు సంబంధించి GHMC కమిషనర్ నుండి పొందిన ఎండార్స్‌మెంట్‌తో కూడిన పత్రాన్ని అందజేశారు.డివిజన్ పరిధిలో శానిటేషన్, తాగునీటి సమస్యలు తదితర మౌలిక వసతుల అభివృద్ధి పనులు అత్యంత అవసరమని జోనల్ కమిషనర్ కి వివరించారు. ఈ పనులు పూర్తయితే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలుగుతాయని, అందుకే వాటికి వెంటనే బడ్జెట్ శాంక్షన్ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు.corporator
వినాయకనగర్ డివిజన్ అభివృద్ధి పనులకు బడ్జెట్ మంజూరు చేయాలి : క్యానం రాజ్యలక్ష్మి




