Friday, March 6, 2026
spot_imgspot_img

వినాయక్ నగర్ డివిజన్ సింహాద్రి నగర్‌లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

Must read

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని సింహాద్రి నగర్‌లో స్థానిక సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. రూ. 13 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి బుధవారం నాడు శుభారంభం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు సూపర్‌వైజర్ వెంకటేష్, బీజేపీ సీనియర్ నాయకులు గౌలీకర్ ఆనంద్, ఓం ప్రకాష్, గోపాల్ యాదవ్, కాలనీవాసులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, “ప్రజలకు మౌలిక వసతులు అందించడం మా ప్రధాన లక్ష్యం. సీసీ రోడ్డు పనులు పూర్తవుతే కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగుతాయి” అని తెలిపారు. స్థానికులు తమ సమస్యలను వివరించగా, వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

కాలనీవాసులు మాట్లాడుతూ, రోడ్డు పనులు ప్రారంభమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో వర్షాకాలంలో రోడ్డు బాగా దెబ్బతిన్నందున ప్రయాణానికి ఇబ్బందులు ఎదురైనట్లు గుర్తుచేశారు. ఇకపై శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

స్థానిక నేతలు మాట్లాడుతూ, “ప్రజల సమస్యలను గుర్తించి తక్షణమే స్పందించిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి గారికి కృతజ్ఞతలు. భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలి” అని కోరారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!