Saturday, June 6, 2026
Google search engine

BRSకి రాజీనామా చేసిన కవిత – జాగృతి నేతలతో కీలక చర్చలు

Must read

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి, అలాగే MLC పదవికి రాజీనామా చేసిన కవిత రాజకీయంగా కొత్త కసరత్తులు మొదలుపెట్టినట్లు సమాచారం. నిన్న ఆమె తన ప్రధాన అనుచరులు, జాగృతి SM ప్రతినిధులు మరియు కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలతో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది.

కవితతో సమావేశమైన నేతల్లో చాలామంది ఉద్యమ సమయంలో చురుకుగా పనిచేసిన వారు అని సమాచారం. అయితే, బీఆర్ఎస్‌లో వారికి పెద్దగా ప్రాధాన్యం రాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వారిని తన జాగృతి సంస్థలో చేరాలని కవిత కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఇక కవిత భవిష్యత్తు రాజకీయ వ్యూహంపై కూడా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. “కవితకు భవిష్యత్తులో స్వతంత్రంగా నిలబడేందుకు ఇది ఒక కొత్త స్ట్రాటజీ కావచ్చు. ఉద్యమంలో పనిచేసిన కానీ పార్టీ పట్టించుకోని నేతలను తనతో కలుపుకోవడం ద్వారా శక్తివంతమైన గ్రూప్‌ను తయారు చేయాలని ఆమె ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది” అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో, ఇవాళ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత కలిసే అవకాశం ఉందని సమాచారం. ఈ సమావేశం ఏ అంశంపై జరుగుతుందనే దానిపై మాత్రం స్పష్టత రాలేదు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!