Saturday, June 6, 2026
Google search engine

విగ్నేశ్వరుని ఆశీస్సులు ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలి : కార్పొరేటర్ బన్నాల

Must read

చిల్కానగర్ డివిజన్‌లోని సాయిరాం నగర్ కాలనీలు మరియు బీరప్ప గడ్డలో అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన గణనాధుల ప్రత్యేక పూజలో చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు. పూజ అనంతరం నిర్వహించిన ప్రసాద వితరణ కార్యక్రమంలో ఆమె ప్రసాదాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, సీనియర్ నాయకులు ఎదుల కొండల్ రెడ్డి, కౌకొండ జగన్, బింగి శ్రీనివాస్, మహమూద్, శ్యామ్ బాలు, గణేష్, మార్క్ శీను పాల్గొన్నారు. అలాగే సాయిరాం నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సీతారామ చారి మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు కూడా హాజరయ్యారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!