Saturday, June 6, 2026
Google search engine

బీఆర్ఎస్ ఆందోళనపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందన

Must read

తెలంగాణలో బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరతపై చేపడుతున్న ఆందోళనలను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్రంగా ఖండించారు. ఆయన ఈ ఆందోళనలను కపట నాటకమని పేర్కొన్నారు. “యూరియా కొరతకు రాష్ట్ర ప్రభుత్వం కారణమా, లేక కేంద్ర ప్రభుత్వం?” అని ప్రశ్నిస్తూ, “యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని పదేళ్ల మీ పాలనలో మీకు తెలియదా?” అని బీఆర్ఎస్ నేతలను విమర్శించారు.రైతుల ముసుగులో తమ ప్రేరేపిత ఉద్యమాలు ప్రజలకు ఎంతగానో ఆదరణ పొందుతాయా? అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, “అధికారం కోల్పోయి, అక్కసుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదలాయించాలనే దిగజారుడు రాజకీయం ఎవరి కోసం?” అని మరో ప్రశ్ననూ ఆయన సూటిగా సంధించారు.
జియో పాలిటిక్స్ కారణంగా దేశీయ ఉత్పత్తి డిమాండ్‌కు తగ్గట్టు లేక యూరియా కొరత ఉంటే, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. “యూరియా సరఫరాలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పై ప్రశ్నలు లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఎందుకు?” అని ఆయన ఆగ్రహంతో చెప్పేశారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!