Friday, March 6, 2026
spot_imgspot_img

వినాయక్ నగర్ డివిజన్ పెండింగ్ పనులపై జోనల్ కమిషనర్‌ను కలసిన కార్పొరేటర్ రాజ్యలక్ష్మి

Must read

సికింద్రాబాద్‌ జోనల్ కమిషనర్‌ రవికిరణ్‌ను కార్పొరేటర్‌ క్యానం రాజ్యలక్ష్మి మర్యాదపూర్వకంగా కలిసి, వినాయక్ నగర్‌ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె సంతోషిమా నగర్‌ చౌరస్తా నుంచి చంద్రగిరి కాలనీ వరకు సీసీ రోడ్‌ నిర్మాణం, కాకతీయ నగర్‌ ఎల్‌పీహెచ్‌ఎస్‌ పాఠశాల నుండి గౌరీశంకర్‌ అపార్ట్మెంట్స్‌ వరకు రహదారి పనులు, వినాయక్ నగర్‌ సబ్ లైన్స్, సూర్య నగర్‌లో బాక్స్ డ్రెయిన్, ఆనంద్ బాగ్ కమ్యూనిటీ హాల్, ఆనంద్ బాగ్ బ్రిడ్జ్ పెయింటింగ్, వెస్ట్ కాకతీయ నగర్‌, బండచెరువులో సిల్ట్ తొలగింపు, వాజ్‌పేయి నగర్‌, వినాయక్ నగర్‌ కమ్యూనిటీ హాళ్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా రిప్రజెంటేషన్‌ సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మంగేష్‌కుమార్‌, మాజీ డివిజన్ అధ్యక్షుడు ఓం ప్రకాష్‌, జ్యోతిర్మయి, గోపాల్‌, సాయి సురేష్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!