Friday, March 6, 2026
spot_imgspot_img

ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాల‌యంలో నంద‌మూరి హ‌రికృష్ణ 7వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం

Must read

నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ విజ‌యం కోసం అహ‌ర్నిశ‌లు శ్ర‌మించినా..ఏనాడు ప‌ద‌వుల కోసం పాకులాడ‌లేద‌ని, రాష్ట్రం స‌మైక్యంగా వుండాల‌న్న ల‌క్ష్యంతో రాజ్య స‌భ స‌భ్య‌త్వాన్ని కూడా తృణ‌ప్రాయంగా వ‌దులుకున్ననాయ‌కుడు నందమూరి హ‌రికృష్ణ అంటూ వ‌క్త‌లు ఆయ‌న సేవ‌ల‌ను కొనియాడారు..

గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో రాజ్య స‌భ మాజీ ఎంపీ, మాజీ రావాణా శాఖ మంత్రి, టిడిపి మాజీ పోలిట్ బ్యూరో స‌భ్యుడు నంద‌మూరి హ‌రికృష్ణ 7వ వ‌ర్ధంతి కార్య‌క్ర‌మం శుక్ర‌వారం నిర్వ‌హించారు.

ముందుగా నంద‌మూరి హ‌రికృష్ణ చిత్ర ప‌టానికి స్వ‌చ్ఛాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్, గౌడ కార్పొరేష‌న్ చైర్మ‌న్ వీరంకి గురుమూర్తి, శాలివాహ‌న కుమ్మ‌రి సంక్షేమ అభివృద్ధి కార్పొరేష‌న్ చైర్మ‌న్ పెరేపి ఈశ్వ‌ర్ మాజీ వుడా చైర్మ‌న్ తుమ్మాటి ప్రేమ‌నాథ్, టిడిపి రాష్ట్ర కార్య‌ద‌ర్శి చెన్నుపాటి గాంధీ, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ ల‌తో పాటు టిడిపి నాయ‌కులు పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

ఈ సంద‌ర్భంగా వ‌క్త‌లు స్వ‌ఛ్చాంధ్ర కార్పొరేష‌న్ చైర్మ‌న్ కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్, గౌడ కార్పొరేష‌న్ చైర్మ‌న్ వీరంకి గురుమూర్తి, మాజీ వుడా చైర్మ‌న్ తుమ్మాటి ప్రేమ‌నాథ్, మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ మాట్లాడ‌తూ
ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన త‌ర్వాత కొన్ని వేల కిలోమీట‌ర్లు రాష్ట్ర వ్యాప్తంగా సుర‌క్షితంగా ప‌ర్య‌టించ‌టానికి కార‌ణం చైత‌న్య ర‌థానికి ర‌థ‌సార‌థిగా హ‌రికృష్ణ వుండ‌టం అన్నారు. హ‌రికృష్ణ ఎన్టీఆర్ త‌న‌యుడి గానే కాకుండా తెలుగుదేశం పార్టీ సైనికుడిగా అహ‌ర్నిశ‌లు శ్ర‌మించి పార్టీ విజ‌యం సాధించ‌టంలో కీల‌క భూమిక పోషించారని ఆయ‌న సేవ‌లు గుర్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలు స‌మైక్యంగా వుండాల‌న్న హ‌రికృష్ణ రాజ్య‌స‌భ‌లో చేసిన ప్ర‌సంగం ఇప్ప‌టికి అంద‌రిలో భావోద్వేగం క‌లుగుజేస్తాయన్నారు. నంద‌మూరి హ‌రికృష్ణ ఆశ‌య సాధ‌న కోసం తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కృషి చేయాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు చెన్నుపాటి ఉషారాణి, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు సొంగా సంజ‌య్ వ‌ర్మ‌, ఎన్టీఆర్ జిల్లా తెలుగు దేశం పార్టీ ఉపాధ్య‌క్షుడు చ‌ల‌సాని ర‌మ‌ణ‌, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్య‌ద‌ర్శి ఫైజాన్, గాంధీ కో ఆప‌రేటివ్ బ్యాంక్ చైర్మ‌న్ స‌క్కుర్తి నాగేశ్వ‌ర‌రావు, ఎన్టీఆర్ జిల్లా వాణిజ్య విభాగ అధ్య‌క్షుడు సొలంకి రాజు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ తెలుగు యువ‌త అధ్య‌క్షుడు ఆర్.మాధ‌వ‌, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ బిసి సెల్ అధ్య‌క్షుడు న‌మ్మి భాను ప్ర‌కాష్ యాద‌వ్, ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ జిల్లా ప్రోగ్రామ్ కో ఆర్డినేట‌ర్ జివి న‌రసింహరావు , టిడిపి సీనియ‌ర్ నాయ‌కులు గుమ్మ‌డి కృష్ణారావు, మాదిగాని గురునాథం, హాబీబ్, సాంబ‌శివ‌రాజు, శేఖ‌ర్ వ‌ర్మ‌, దొండ‌పాటి శ్రీనివాస్, పొట్లూరి పండు , మ‌ల్లెల రామ‌కృష్ణ‌, పామ‌ర్తి కిశోర్ బాబు, పాల‌డుగు దుర్గారావు, విజ‌య‌వాడ అర్బ‌న్ మాజీ ప్ర‌చార కార్య‌ద‌ర్శి కిలారి చంద్ర‌శేఖ‌ర్, అంగ‌న్ వాడీ స్టేట్ మీడియా కో ఆర్డినేట‌ర్ చెరుకూరి మాధ‌వి, పార్ల‌మెంట్ మ‌హిళ సోష‌ల్ మీడియా కో ఆర్డినేట‌ర్ వై.మాధ‌వి, పార్ల‌మెంట్ తెలుగు మ‌హిళ నాయ‌కురాలు నాగ‌ర‌త్నం, తెలుగు మ‌హిళ నాయ‌కురాలు గౌసియ బేగం ల‌తో పాటు టిడిపి కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!