Friday, March 6, 2026
spot_imgspot_img

తెలంగాణ మంత్రి సీతక్క‌, కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి భేటీ

Must read

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి తో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల కోసం మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు.

“తెలంగాణ రాష్ట్రం మహిళా, శిశు సంక్షేమ రంగాల్లో అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ పథకాలు మరింత విజయవంతంగా కొనసాగించడానికి అదనపు నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది,” అని మంత్రి సీతక్క చెప్పారు.

ఈ సందర్భంగా, మిషన్ వత్సల్య పథకం కింద 22 వేల మంది అనాథ పిల్లల సంరక్షణ కోసం రూ.105 కోట్లు, పీవీటీజీ ప్రాంతాల్లో 216 అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణం కోసం రూ.5 కోట్లు, పోషణ అభియాన్ కింద పెండింగ్‌లో ఉన్న రూ.71 కోట్లతో పాటు, అదనంగా రూ.17 కోట్లు మంజూరు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. అలాగే, కౌమార బాలికల నైపుణ్యాభివృద్ధి కోసం రూ.220 కోట్లు, అడోలెసెంట్ గర్ల్స్ ప్రోగ్రామ్ కింద రూ.7 కోట్లు విడుదల చేయాలని కోరారు.

అంతేకాకుండా, గత ఆర్థిక సంవత్సరానికి చెందిన 4వ త్రైమాసిక నిధులు రూ.54 కోట్లు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 1వ త్రైమాసికానికి రూ.200 కోట్లు విడుదల చేయాలని కూడా మంత్రి సీతక్క విజ్ఞప్తి చేశారు. ఈ నిధులు అంగన్‌వాడీ సేవల బలోపేతానికి ఉపయోగపడతాయని ఆమె పేర్కొన్నారు.

ఈ విజ్ఞప్తులపై స్పందించిన కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి, ములుగు జిల్లాకు నిర్భయ ఫండ్ కింద రూ.10 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. “పెండింగ్ నిధులను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇస్తున్నాము,” అని ఆమె చెప్పినట్లు మంత్రి సీతక్క తెలిపారు.

ఈ సందర్భంగా, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా, తెలంగాణ చేనేత చీరను డా. సీతక్క కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి కి బహుకరించారు. దీనికి సంబంధించిన అభినందనలు కేంద్ర మంత్రి అన్నపూర్ణా దేవి తెలిపారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!