Saturday, June 6, 2026
Google search engine

గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ఆరా తీసిన రాంచందర్ రావు

Must read

నాగర్‌కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడలోని గురుకుల పాఠశాలలో ఇటీవల ఆహారం విషపూరితంగా మారిన ఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థులను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పరామర్శించారు. వసతిగృహంలో ఉన్న విద్యార్థులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల నిర్వాహకులతో సమావేశమై సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు.

వంటశాలను, భోజన సరఫరా ప్రక్రియను, హైజీన్తో పాటు మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం తగదని అధికారులను హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి జవాబుదారీ తీరుండాలని ఆయన హితవు పలికారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!