Saturday, June 6, 2026
Google search engine

“సొంత కుటుంబసభ్యుల వాయిస్ వినాల్సిన పరిస్థితి వస్తే జీవితం విలవిల”

Must read

ఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సీఎం రేవంత్‌ రెడ్డిది సంచలన వ్యాఖ్య. బుధవారం నాడు ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఇలాంటి పరిస్థితులు వస్తే, అంటే సొంత కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సి వచ్చినా, బతుకేదీ అనే స్థితి వస్తే, అది కన్నా సూసైడ్ మేలంటూ” భావోద్వేగంగా స్పందించారు.ఫోన్ ట్యాపింగ్ చట్టవ్యతిరేకం కాదని కానీ అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు సీఎం. ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఇప్పటికే సిట్‌ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) విచారణ జరుపుతోందనీ, దాని ముందు తమ హస్తక్షేపం లేదని స్పష్టం చేశారు.”నా ఫోన్ ట్యాపింగ్ కాలేదనుకుంటున్నా… ట్యాపింగ్ జరిగి ఉంటే కచ్చితంగా నాకు సమాచారం వచ్చేది. అయితే విచారణ పూర్తయ్యే వరకు ఎదైనా తేల్చలేం,” అని సీఎం చెప్పారు.ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!