Saturday, June 6, 2026
Google search engine

హస్తినలో ముగిసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం

Must read

తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరుల అంశాలపై న్యూఢిల్లీలో కీలక సమావేశం ముగిసింది. ఈ సమావేశం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన సుమారు గంటన్నర పాటు కొనసాగింది.సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యంగా గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం అంశాన్ని ఏపీ ప్రభుత్వం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఈ సమావేశానికి తీసుకురాగా, తెలంగాణ ప్రభుత్వం పది పైగా అంశాలతో కేంద్రం ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా ఇరురాష్ట్రాల సీఎంలు తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచారు. జలవనరుల పంపకాల్లో సమన్వయం, పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల నిర్వహణ తదితర అంశాలపై చర్చలు జరిపారు.సమావేశంలో ఇరురాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు (ఏపీ), ఉత్తమ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జలవనరుల శాఖ కార్యదర్శులు, సీనియర్ ఇంజినీర్లు తదితర అధికారులు హాజరయ్యారు.కేంద్రం సమన్వయంతో జలవనరుల వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరకాలని ఇరురాష్ట్రాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!