Friday, March 6, 2026
spot_imgspot_img

ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు

Must read

పెద్దపల్లి నియోజకవర్గ కేంద్రంలో “ఇందిరా మహిళా శక్తి సంబరాలు” మంగళవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, సీతక్క ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళా సంఘాలకు వేలాది చెక్కులను పంపిణీ చేయగా, కొత్తగా మహిళల ఆధ్వర్యంలో నడిపించబోయే RTC అద్దె బస్సులను మంత్రులు ప్రారంభించారు. బస్సుల మొదటి నెల అద్దె కింద రూ.3.47 లక్షలు చెల్లించగా, వడ్డీ రాయితీ కింద రూ.4.94 కోట్ల చెక్కు మంజూరు చేశారు. ప్రమాద బీమా, లోన్ బీమా కింద సుమారు రూ. కోటి విలువైన చెక్కులను మంత్రులు అందించారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ –
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చడం. ఆయన నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం, ఏర్పడిన 48 గంటలకే మహిళల ప్రయాణ భారం తొలగించేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. ఇప్పుడీ ప్రయాణికులనే బస్సు ఓనర్లుగా మార్చిన ఘనత కూడా మన ప్రభుత్వానిదే,” అని పేర్కొన్నారు.

“ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు మహిళలచే కుట్టించడంతో, మహిళా సంఘాలకు ఇప్పటివరకు రూ.30 కోట్ల ఆదాయం వచ్చింది. ఐకేపీ కేంద్రాల ద్వారా మహిళలు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పెద్దపల్లిలోని ‘ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్స్’ నుంచే ప్రభుత్వ ఆసుపత్రులకు భోజనం సరఫరా అవుతోంది,” అని వివరించారు.

పరిశ్రమల పట్ల మహిళల మక్కువ:
పెద్దపల్లి మహిళలు ఆదానీ, అంబానీలకు పోటీగా సోలార్ ప్లాంట్ల స్థాపనకు సిద్దమవుతున్నట్లు మంత్రి తెలిపారు. రైస్ మిల్లులు, గోదాములు కూడా మహిళలకే అప్పగించాలని సీఎం ఆలోచిస్తున్నారని వెల్లడించారు.

ఆర్థిక స్వావలంబనపై దృష్టి:
మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే కుటుంబం, సమాజం ఆనందంగా ఉంటుందని పేర్కొన్న మంత్రి సీతక్క, మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఇప్పటివరకు రూ.26 వేల కోట్ల వరకు సాయం అందించామని చెప్పారు. మహిళలు తీసుకున్న రుణాలపై వడ్డీని ప్రభుత్వం భరిస్తోందని, రుణాలు తిరిగి చెల్లించడంతో బ్యాంకులు స్వయంగా రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నాయని వివరించారు.

ప్రధాన మంత్రి ప్రశంసలు:
మహిళా సంఘాల వ్యాపార విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారని మంత్రి గుర్తుచేశారు. “ఇప్ప పువ్వుల లడ్డూ, ఆదివాసీ స్నాక్స్ వంటి ఉత్పత్తులు ప్రధాని ‘మన్కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించటం మన అందరికీ గర్వకారణం,” అన్నారు.

“మహిళలు తమ ఆర్థిక అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలను ముందుకు తేవాలి. ప్రభుత్వం అందుకు అనుగుణంగా కార్యాచరణను రూపొందించి, అమలు చేయడానికి సిద్దంగా ఉంది,” అంటూ మంత్రి సీతక్క తమ సందేశాన్ని ముగించారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -

Latest article

error: Content is protected !!