Saturday, June 6, 2026
Google search engine

బంగాళాఖాతంలో అల్పపీడన సూచన 

Must read

తెలుగు రాష్ట్రాలను సమయానికి తాకిన నైరుతి రుతుపవనాలు గడచిన కొన్ని రోజులుగా మందగించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి. వర్షాలు పడాల్సిన సమయంలో తీవ్ర ఎండలు, తేలికపాటి గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోత తీవ్రంగా మారింది.

ఇప్పటివరకు ఈ నెలలో 30 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆకాశంలో అల్పపీడనం ఏర్పడినప్పుడే రుతుపవనాల్లో చురుకుదనం కనిపిస్తుందని వారు చెప్పారు.

అయితే, రానున్న రోజుల్లో వర్షాలు తిరిగి బలపడే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా మరియు రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు పెరగనున్నాయి. అలాగే, 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

ఇక మధ్యభారతదేశం, ఉత్తరభారత ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. వీటి ప్రభావం రానున్న రెండు మూడు రోజుల్లో దక్షిణ భారతదేశంలో కూడా బలపడనుందని, దీని వల్ల బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

తెలంగాణలో ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాదులోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన.

వాతావరణ పరిస్థితుల ఆధారంగా రైతులు, పౌరులు తమ వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరుతోంది.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!