Saturday, June 6, 2026
Google search engine

తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఘనంగా డా.శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

Must read

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం నాడు డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలు అర్పించిన డా. శ్యామాప్రసాద్ ముఖర్జీ సేవలను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయంలో డా. ముఖర్జీ చిత్రపటానికి పుష్పాంజలి అర్పిస్తూ, నాయకులు ఆయన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ, “దేశం ఏకత్వం, భిన్నత్వంలో ఐక్యత కోసం డా. శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం స్మరణీయమైంది. ఆయన సాధించిన సిద్ధాంతాలు, విలువలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలి” అని పేర్కొన్నారు.

అనంతరం కార్యకర్తలందరూ దేశభక్తి నినాదాలు చేస్తూ ముఖర్జీ స్ఫూర్తితో ముందుకు సాగాలని సంకల్పం తీశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -spot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!