జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలనే డిమాండ్‌తో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ చేపట్టిన మహాపాదయాత్రకు వినాయక నగర్ నుంచి మద్దతు లభించింది. ఈ యాత్రలో భాగంగా మంగళవారం వినాయక నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజలక్ష్మి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈటల రాజేందర్‌కు సంఘీభావం తెలిపారు.డంపింగ్ యార్డ్ సమస్యతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, దాని తరలింపు అంశంపై సంబంధిత అధికారులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా క్యానం రాజలక్ష్మి ఆధ్వర్యంలో వినాయక నగర్‌కు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు డిమాండ్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.




