Rajamouli : హాలీవుడ్ ఆఫర్స్ వచ్చాయి.. వారణాసి అయ్యాక హాలీవుడ్ సినిమా.. రాజమౌళి కామెంట్స్ వైరల్..

Must read

Rajamouli : RRR తో ఆస్కార్ సాధించి పాన్ వరల్డ్ ఫేమ్ తెచ్చుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో వారణాసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో హాలీవుడ్ రిలీజ్ ప్లాన్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 2027 ఏప్రిల్ 7న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని అధికారికంగా కూడా ప్రకటించారు.

వారణాసి సినిమానే హాలీవుడ్ టార్గెట్ చేసుకొని తెరకెక్కిస్తుండగా తాజాగా రాజమౌళి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బ్రెజిల్‌లో జరుగుతున్న 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రాజమౌళి పాల్గొన్నారు.

Also See : Nagadurga : హాఫ్ శారీలో నాగదుర్గ.. ఇడుపు కాయితం ఈవెంట్లో సందడి..

ఈ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడూతూ.. RRR సినిమా తర్వాత నాకు హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. హాలీవుడ్ పనితీరు, నిర్మాణాత్మక శైలి చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అందుకే హాలీవుడ్లో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని అనుకుంటున్నాను. కానీ ఆ ఆఫర్స్ వచ్చే సమయానికే నా నెక్స్ట్ సినిమా వారణాసి పనులు మొదలయ్యాయి. ఒకేసారి రెండు, మూడు ప్రాజెక్టులపై నేను పనిచేయలేను. ఒక సినిమా మొత్తం అయ్యాకే నేను ఇంకో సినిమాపై దృష్టి పెడతాను. అందుకే వారణాసి సినిమా రిలీజ్ అయ్యాక నాకు వచ్చిన హాలీవుడ్ ఆఫర్ల గురించి కచ్చితంగా ఆలోచిస్తాను అని తెలిపారు.

దీంతో వారణాసి సినిమా తర్వాత రాజమౌళి డైరెక్ట్ హాలీవుడ్ సినిమా చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also See : Samantha : బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫొటోలు.. భర్తతో కలిసి బ్లాక్ డ్రెస్‌లో సామ్..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!