Tilak Varma : న్యూజిలాండ్‌తో తొలి టీ20 మ్యాచ్‌.. తెలుగు క్రికెట‌ర్ తిల‌క్ వ‌ర్మ‌ను ఊరిస్తున్న భారీ మైలురాయి..

Must read

Tilak Varma : భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య అక్టోబ‌ర్ 22 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. గురువారం క్రైస్ట్‌చ‌ర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా మిడిల్ ఆర్డ‌ర్ ఆటగాడు, తెలుగు తేజం తిల‌క్ వ‌ర్మ‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తుంది.

ఈ మ్యాచ్‌లో అత‌డు ఏడు సిక్స‌ర్లు బాదితే.. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్స‌ర్ల క్ల‌బ్‌లో చేరుతాడు. ఈ ఘ‌న‌త సాధించిన ఏడో భార‌త బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్క‌నున్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో భార‌త్ త‌రుపున ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ, సూర్య‌కుమార్ యాద‌వ్, అభిషేక్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్యా, సంజూ శాంస‌న్‌లు మాత్ర‌మే 100 సిక్స‌ర్లు కొట్టారు.

Bhuvneshwar Kumar : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను ఊరిస్తున్న భారీ మైలురాళ్లు..

2023లో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో తిల‌క్ వ‌ర్మ అరంగ్రేటం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు అత‌డు 70 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 43.8 స‌గ‌టుతో 1841 ప‌రుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచ‌రీలు, 10 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. 140 ఫోర్లు, 93 సిక్స‌ర్లు బాదాడు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 100 సిక్స‌ర్లు కొట్టిన భార‌త ప్లేయ‌ర్లు..

* రోహిత్ శ‌ర్మ – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు
* సూర్య‌కుమార్ యాద‌వ్ – 113 మ్యాచ్‌ల్లో 179 సిక్స‌ర్లు
* అభిషేక్ శ‌ర్మ – 67 మ్యాచ్‌ల్లో 143 సిక్స‌ర్లు
* హార్దిక్ పాండ్యా – 138 మ్యాచ్‌ల్లో 126 సిక్స‌ర్లు
* విరాట్ కోహ్లీ – 125 మ్యాచ్‌ల్లో 124 సిక్స‌ర్లు
* సంజూ శాంస‌న్ – 77 మ్యాచ్‌ల్లో 103 సిక్స‌ర్లు

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!