Telangana Rains : అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలంగాణలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఈ జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు..

Must read

Telangana Rains : తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Also Read : Tirumala : తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ వరకు సిఫార్సు లేఖలు స్వీకరించరు.. కారణమిదే..

దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో చెన్నై, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఇప్పటికే చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, రాణిపేట జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు.. ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం తిరుపతిలో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. దీనికితోడు శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడ వీధులను పొగమంచు కమ్మేసింది. దీంతో ఘాట్ రోడ్లలో ప్రయాణించే భక్తులు అప్రమత్తంగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూచించింది. వాహనాల్లో వచ్చే వారు నెమ్మదిగా రావాలని సూచించింది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడింది. అయితే, రాష్ట్రంలో ఇవాళ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10గంటల మధ్యలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఉంటుందని, రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!