Harmanpreet Kaur : జింబాబ్వేతో సిరీస్‌ క్లీన్‌స్వీప్‌.. కన్నీళ్లు పెట్టుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్.. వీడియో వైరల్

Must read

Harmanpreet Kaur : జింబాబ్వేతో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం రాత్రి జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 92 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ 91, షెఫాలీ వర్మ 69 సత్తాచాటారు. 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత మహిళల జట్టు భారీ విజయాన్ని అందుకుంది.

Also Read : Temba Bavuma : రోహిత్ శర్మ రికార్డును బద్దలు కొట్టిన దక్షిణాఫ్రికా కెప్టెన్.. ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డులు

భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. జింబాబ్వేతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో కేవలం 41 బంతుల్లోనే అజేయంగా 91 పరుగులు చేసి అందరినీ ఆకట్టుకుంది. అయితే మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొట్టిన ఆమె.. మ్యాచ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ ప్రదర్శన ఎంత అద్భుతంగా ఉందో.. ఆమె భావోద్వేగ క్షణం కూడా అంతే చర్చనీయాంశంగా మారింది. ఇటీవల బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆమె.. ఈ ఇన్నింగ్స్‌తో తన సత్తా ఏమిటో మరోసారి నిరూపించింది. గత 10 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా చేయని హర్మన్‌ప్రీత్.. ఈ మ్యాచ్ లో తన సహజమైన దూకుడుతో భారీ ఇన్నింగ్స్ ఆడింది.

ఇన్నింగ్స్ విరామ సమయంలో మాజీ భారత మహిళా జట్టు కోచ్ డబ్ల్యూవీ రామన్‌తో మాట్లాడిన ఆమె.. తన బ్యాటింగ్‌ను ఆస్వాదించాలనుకున్నానని తెలిపింది. తాను కోరుకున్న విధంగా ఆడేందుకు ప్రోత్సహించిన రామన్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఆయన మాటలు తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయని పేర్కొంటూ భావోద్వేగానికి గురైంది.

తన అద్భుతమైన ఇన్నింగ్స్ వెనుక సాధన, కోచ్‌ల ప్రోత్సాహం ఉన్నాయని హర్మన్‌ప్రీత్ వెల్లడించింది. ఆసియా క్రీడల తర్వాత నెట్స్‌లో ఎక్కువ సమయం సాధన చేసే అవకాశం లభించిందని తెలిపింది. తన బ్యాటింగ్ కోచ్ హిమాన్షు చావ్లా ఎంతో కష్టపడ్డారని, తన బ్యాటింగ్ శైలిని అర్థం చేసుకుని మెరుగుపడేందుకు సహకరించారని పేర్కొంది. బ్యాట్ స్వింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టి, అదే విధానాన్ని పదేపదే సాధన చేయడం ద్వారా తిరిగి ఆత్మవిశ్వాసాన్ని పొందినట్లు వివరించింది.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!