Dussehra Celebrations : మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దసరా వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎర్రవెల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్ సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు. వేద పండితులు సమక్షంలో వాహన పూజ, ఆయుధ పూజలు నిర్వహించారు. అనంతరం శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు.
Also Read : Abhijeet Dipke : దీపావళి వరకు నిరసనలకు బ్రేక్.. కార్యకర్తలకు అభిజీత్ దీప్కే కీలక విజ్ఞప్తి.. కారణమిదే..!
దసరా వేడుకల్లో కేసీఆర్ తోపాటు కేసీఆర్ సతీమణి శోభమ్మ, కుమారుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు రావు పాల్గొన్నారు. అంతేకాక పలువురు పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. సంప్రదాయ పద్దతిలో నిర్వహించిన పూజలతో ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ఎర్రవెల్లి నివాసంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.
వేద పండితుల సమక్షంలో కేసీఆర్ గారు సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ, ఆయుధపూజ నిర్వహించారు. శమీ వృక్షానికి పూజ నిర్వహించిన కేసీఆర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఎర్రవెల్లిలోని నివాసంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్ దంపతులు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దంపతులు, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు తదితర కుటుంబ సభ్యులతో పాటు మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, జహంగీర్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.
— BRS Party (@BRSparty) October 20, 2026


