Manchu Manoj : మంచు మనోజ్ హీరోగా ఓ ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రాన్ని ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’గా తెరకెక్కించనున్నారు. RPA క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా ఆ సంస్థకు నాలుగో ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్.పి. అక్షిత్ రెడ్డి, ఆర్. సుదర్శన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
RC 17 : RC 17లో చిరంజీవి స్పెషల్ రోల్?
ఈ సినిమా కోసం దర్శకుడు శక్తివంతమైన కథను సిద్ధం చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇప్పటివరకు మంచు మనోజ్‌ను చూడని సరికొత్త అవతార్‌లో ఈ చిత్రంలో చూపించనున్నారు. పోతరాజు నేపథ్యంలో దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాలతో సినిమాను రూపొందించనున్నారు.
తెలంగాణ పండుగల వైభవం, స్థానిక సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దైవిక అంశాలతో కూడిన యాక్షన్, థ్రిల్లింగ్ కథాంశం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుందని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.
సినిమా టైటిల్‌తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలోనే ప్రకటించనుంది.


