CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలోని తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలోని ఆంజనేయస్వామి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో సీఎం పాల్గొంటారు. ఆ తరువాత గ్రామస్తులను, ప్రజాప్రతినిధులను, అధికారులను కలవనున్నారు. సాయంత్రం కొండారెడ్డిపల్లిలో జరిగే జమ్మిపూజలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొంటారు.
CM Revanth Reddy : స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్రెడ్డి దసరా వేడుకలు


