Moto G47 Power Leak : 7000mAh బ్యాటరీతో కొత్త మోటో G47 పవర్ వస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 78 గంటలపైనే బ్యాకప్!

Must read

  • మోటో G47 పవర్ 7,000mAh బ్యాటరీ, IP64 రేటింగ్‌తో లాంచ్
  • ఈ ఫోన్ 78 గంటల 19 నిమిషాల వరకు బ్యాకప్ అందిస్తుంది
  • 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఐదేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్

Motorola Moto G47 Power : భారీ బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా? మోటోరోలా నుంచి సరికొత్త ఫోన్ రాబోతుంది. అదే మోటో G47 పవర్. ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని కీలక వివరాలు లీక్ అయ్యాయి. ముఖ్యంగా 7,000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలివే..

7,000mAh బ్యాటరీ.. 33W ఫాస్ట్ ఛార్జింగ్ :
నివేదికల ప్రకారం.. మోటో జీ47 పవర్ యూరప్‌కు చెందిన (EPREL) ఎనర్జీ లేబులింగ్ డేటాబేస్‌లో (Moto G47 Power Leak) కనిపించింది. ఈ ఫోన్ XT2625-15 మోడల్ నంబర్‌తో రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఇందులో బ్యాటరీ సామర్థ్యం 6,790mAhగా పేర్కొన్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా 7,000mAh బ్యాటరీ ఉండొచ్చు. ఈ ఫోన్‌లో 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండవచ్చని అంచనా. గతంలో లాంచ్ అయిన మోటో జీ47లో 5,200mAh బ్యాటరీ, 20W ఛార్జింగ్ సపోర్ట్ అందించనుంది. కొత్త పవర్ వేరియంట్ బ్యాటరీతో భారీ అప్‌గ్రేడ్‌ ఉండొచ్చు.

Read Also : EPFO Scheme : PF అకౌంట్ ఉన్నవారికి గుడ్ న్యూస్.. కేంద్రం నుంచి రూ.15,000 ఆర్థిక సాయం.. అర్హతలివే..!

78 గంటల బ్యాటరీ లైఫ్.. IP64 రేటింగ్ :
లీకైన వివరాల ప్రకారం.. మోటో జీ47 పవర్ గరిష్ఠంగా 78 గంటల 19 నిమిషాల బ్యాటరీ లైఫ్‌ను అందించవచ్చని సమాచారం. బ్యాటరీ 1,200 ఛార్జింగ్ సైకిల్స్‌కు రేటింగ్ పొందినట్లు తెలుస్తోంది. ఎనర్జీ ఎఫిషియెన్సీకి క్లాస్ A, రిపేరబిలిటీకి క్లాస్ B రేటింగ్స్ ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. అంతేకాదు, ఈ ఫోన్‌కు IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ లభించనుంది. ఐదేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ కూడా అందించవచ్చని సమాచారం..

ధర ఎంత ఉండొచ్చు? :
4GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర యూరప్‌లో €350గా ఉండవచ్చని అంచనా. భారత కరెన్సీలో సుమారు రూ.37వేలు ఉండొచ్చు. అయితే, భారత్‌లో ధర, లాంచ్ తేదీ, ప్రాసెసర్, కెమెరా వివరాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!