India vs West indies 5th T20 : భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా శనివారం రాత్రి 7గంటలకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరో రెండు మ్యాచ్లలో విజయంతో 2-2తో ఉన్నాయి. ఇవాళ జరిగే మ్యాచ్ సిరీస్ ఫలితాన్ని నిర్ణయించేది కావడంతో క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది.
Also Read : Shubman Gill : శుభ్మన్ గిల్ బిగ్ డెసిషన్.. న్యూజిలాండ్ సిరీస్కు ముందు కీలక మ్యాచ్!
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. అయితే, అక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో ఆటకు అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ సాయంత్రం 7గంటల సమయంలో 65శాతం వర్షం పడే చాన్స్ ఉందని తెలిపింది. రాత్రి 10గంటల వరకు వర్షం ముప్పు పొంచి ఉండటంతో మ్యాచ్ జరిగే విషయంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒకవేళ భారీ వర్షం పడకుంటే తక్కువ ఓవర్లలో మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. భారీ వర్షం కురిస్తే మాత్రం మ్యాచ్ రద్దయ్యే పరిస్థితి ఉంటుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ఇరు జట్లు ట్రోఫీని పంచుకోవాల్సి ఉంటుంది.
చిన్నస్వామి స్టేడియంలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగినా మైదానాన్ని త్వరగా ఆటకు సిద్ధం చేసేందుకు అధునిక సబ్ ఎయిర్ డ్రెయినేజీ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే, నిరంతరంగా వర్షం కురిస్తే మ్యాచ్ నిర్వహణ కష్టంగా మారనుంది.
ఈ మ్యాచ్ ద్వారా నాలుగేళ్ల తరువాత టీమిండియా ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ జట్టులో అడుగుపెట్టనున్నాడు. చివరిసారిగా 2022 నవంబర్ నెలలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన భువనేశ్వర్ కుమార్.. ఇప్పుడు తుది జట్టులో చోటు దక్కితే దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత అంతర్జాతీయ టీ20ల్లో ఆడినట్లవుతుంది.
మరోవైపు.. ఇవాళ జరిగే మ్యాచ్లో యువ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభిస్తుందా అన్నది అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. తొలి నాలుగు మ్యాచ్లలో అతడికి ఆడే అవకాశం రాలేదు. మరోవైపు అభిషేక్ శర్మను తప్పించి వైభవ్ సూర్యవంశీని ఆడించవచ్చుననే అంచనాలు వినిపిస్తున్నాయి.
భారత జట్టు అంచనా..
సంజు శాంసన్ (WK), అభిషేక్ శర్మ/వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, నమన్ ధీర్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్/కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్


