Bigg Boss Today Promo : షాలినికి ఇచ్చి పడేసిన నాగార్జున.. ఏడుపు ఒక్కటే తక్కువ.. ప్రోమో వైరల్.. ఎలిమినేట్ అవుతుందా?

Must read

Bigg Boss Today Promo : నేడు శనివారం బిగ్ బాస్ వీకెండ్ ప్రోమో విడుదల చేసారు. ఈ ప్రోమో అంతా షాలిని పైనే సాగింది. షాలిని నామినేషన్స్ గురించి మాట్లాడొద్దన్నా మళ్ళీ మాట్లాడినందుకు, త్రిగున్ ని బూతులు తిట్టినందుకు, నీతూ మాస్టర్ ని తిట్టినందుకు నాగార్జున ఫైర్ అయ్యారు. గత వారం చెప్పినా మారలేదని తిట్టారు. ఎప్పట్లాగే రోహిత్ షాలిని సపోర్ట్ గా మాట్లాడటానికి ట్రై చేయడంతో అతనిపై కూడా ఫైర్ అయ్యాడు నాగార్జున. ఇప్పటికే రెండు సార్లు చెప్పినా నామినేషన్స్ గురించి మాట్లాడినందుకు అమన్, షాలిని, రోహిత్ లకు వచ్చే వారం కెప్టెన్సీ రేసులో పాల్గొనకూడదు అని పనిషమెంట్ ఇచ్చారు నాగ్. దీంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.

షాలిని చేసే హడావిడికి, ఆమె ఆడే గేమ్ కి ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సి ఉంది. గత వారం కూడా అదృష్టంతో చివరి నిమిషాల్లో సేవ్ అయింది. షాలిని ఏం లేకపోయినా అందరి మీద అరుస్తుందని, బూతులు తిడుతుందని, గొడవలకు వెళ్తుందని, ఫుడ్ వేస్ట్ చేస్తుందని, ఎంత సేపు రోహిత్ తోనే లవ్ ట్రాక్ నడుపుతుందని విమర్శలు ఉన్నాయి. నాగార్జున, ఆడియన్స్, హౌస్ లోకి కొత్తగా వచ్చిన వైల్డ్ కంటెస్టెంట్స్ ఎవరు వచ్చినా మారట్లేదు షాలిని.

Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ బర్త్ డే.. పెళ్లి తర్వాత మరింత బిజీగా..

ఈ వారం నామినేషన్స్ లో ఉంది షాలిని. వోటింగ్ లో కూడా చివర్లో ఉన్నట్టు సమాచారం. దీంతో ఈ వారం అయినా వెళిపోతుందా లేదా హౌస్ లోనే ఉండి ఇలాగే అరుస్తూ ఉంటుందా అనే చర్చ జరుగుతుంది. మీరు కూడా లేటెస్ట్ బిగ్ బాస్ ప్రోమో చూసేయండి..

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!