- శాంసంగ్ గెలాక్సీ A38 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్
- ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరా ఉండే ఛాన్స్
- శాంసంగ్ గెలాక్సీ A37 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్
Samsung Galaxy A38 5G : శాంసంగ్ నుంచి అతి త్వరలో శాంసంగ్ గెలాక్సీ A38 5జీ వచ్చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా. ఈ ఏడాది మార్చిలో భారత మార్కెట్లో లాంచ్ అయిన శాంసంగ్ గెలాక్సీ A37 5జీ స్థానంలో రానుంది.
మీడియా రిపోర్టు ప్రకారం.. :
శాంసంగ్ గెలాక్సీ A38 5G ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంటుందని అంచనా.
వచ్చే ఏడాదిలోనే లాంచ్ :
శాంసంగ్ గెలాక్సీ A38 5G వచ్చే ఏడాది ప్రారంభంలో శాంసంగ్ గెలాక్సీ A58 5జీతో పాటుగా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ స్మార్ట్ఫోన్ల లాంచ్ శాంసంగ్ ఇంకా రివీల్ చేయలేదు. ఈ సిరీస్‌లోని గత స్మార్ట్ఫోన్ల కన్నా శాంసంగ్ గెలాక్సీ A38 5జీ ధర ఎక్కువగా ఉంటుందని అంచనా.
Read Also : Vi Family Plan : Vi కొత్త ప్లాన్ అదుర్స్.. ఒకే గ్రూప్‌లో నలుగురు.. ఫ్యామిలీతో డేటా షేరింగ్ ఈజీ.. ఎలాగంటే?
శాంసంగ్ గెలాక్సీ A37 5జీ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, విజన్ బూస్టర్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల FHD+ సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆసమ్ లావెండర్, ఆసమ్ చార్కోల్, ఆసమ్ గ్రేగ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్లు, స్పెషిఫికేషన్లు (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ A38 5జీ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా, 5MP మాక్రో కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరా కూడా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్సినోస్ 1480 ప్రాసెసర్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ A37 5జీలో 45W ఛార్జింగ్‌కు సపోర్టు ఇచ్చే 5,000mAh బ్యాటరీ కూడా ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సర్కిల్ టు సెర్చ్ వంటి టూల్స్ ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6 ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్లను అందిస్తామని శాంసంగ్ ప్రకటించింది. శాంసంగ్ గెలాక్సీ A08 ఇటీవల భారత మార్కెట్లో లాంచ్ అయింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ PLS LCD డిస్ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో G99+ చిప్సెట్తో రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 9పై రన్ అవుతుంది. శాంసంగ్ గెలాక్సీ A08 డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్లో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ కెమెరా ఉన్నాయి. 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.


