Telangana Govt : బీసీ విద్యార్థులకు శుభవార్త.. రూ.20లక్షల స్కాలర్‌షిప్.. ఈనెల 31వరకు అవకాశం..

Must read

Mahatma Jyotiba Phule Overseas Vidyanidhi scheme

Telangana Govt BC Overseas Scholarship : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ విద్యార్థులకు శుభవార్త చెప్పింది. స్కాలర్ షిప్ దరఖాస్తులకు గడువును పెంచింది. అక్టోబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పించింది.

Also Read : Supreme Court: మత మార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే బీసీ అర్హత రద్దు

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఈబీసీ విద్యార్థులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం మహాత్మాజ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద ఎంపికైన అర్హులైన విద్యార్థులకు నిబంధనలకు అనుగుణంగా రూ.20లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే అవకాశం ఉంది. అయితే, ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు తొలుత గడువు అక్టోబర్ 15వ తేదీతో ముగియనుంది. తాజాగా. ఈ గడువును ప్రభుత్వం పొడిగించింది. అక్టోబర్ 31వ తేదీ వరకు పెంచినట్లు బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. బాలామాయాదేవి వెల్లడించారు.

విదేశాల్లో చదువుకోవడానికి అయ్యే ఖర్చులు చాలా మందికి భారంగా మారుతున్న నేపథ్యంలో అర్హత కలిగిన విద్యార్థులు ప్రభుత్వ ఆర్థిక సహాయ పథకాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుని దరఖాస్తు చేసుకోవడం ముఖ్యమని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మాస్టర్స్, డాక్టోరల్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు ఈ అవకాశాన్ని పరిశీలించవచ్చు.

అర్హతలు.. దరఖాస్తు విధానం..
♦ మహాత్మాజ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు అన్ని వనరుల నుంచి కుటుంబానికి వచ్చే వార్షిక ఆదాయం రూ.5లక్షలలోపు ఉండాలి.
♦ దరఖాస్తు చేసుకునే తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
♦ డిగ్రీలో కనీసం 60శాతం మార్కులు సాధించి ఉండాలి.
♦ GRE పరీక్షలో కనీసం 260 స్కోర్ లేదా GMATలో 550 స్కోర్ సాధించి ఉండాలి.
♦ TOEFLలో 60 స్కోర్ లేదా IELTSలో 6.0 బ్యాండ్ లేదా PTEలో 50 స్కోర్ కలిగి ఉండాలి.
♦ అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించిన వివరాలను తెలుసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
♦ తెలంగాణ ఈ-పాస్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పోర్టల్ https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.doను సందర్శించాలి.
♦ దరఖాస్తు ప్రక్రియలో అవసరమైన విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, వయస్సుకు సంబంధించిన వివరాలు, విదేశీ విద్యకు అవసరమైన పరీక్షల స్కోర్లు వంటి పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
♦ అధికారిక నోటిఫికేషన్‌లో సూచించిన పత్రాలు, నిబంధనలను అనుసరించి దరఖాస్తును పూర్తి చేయాలి.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!