
Anupama Parameswaran : హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కు ఇటీవల కొని రోజుల క్రితం తమిళ హీరో ధృవ్ విక్రమ్ తో బ్రేకప్ అయిందని, వీళ్లిద్దరి మధ్య గొడవలు అయ్యాయి అని వార్తలు వచ్చాయి. అనుపమ తన సోషల్ మీడియా ద్వారా, ఓ ఇంటర్వ్యూలో ఆ వ్యక్తి ఎవరో చెప్పకపోయినా బ్రేకప్ గురించి మాట్లాడింది. చాలా బాధపడినట్టు, డిప్రెషన్ లోకి వెళ్లినట్టు కూడా చెప్పింది. అయితే ఆ బాధ నుంచి చాలా కష్టపడి బయటకు వచ్చినట్టు కూడా తెలిపింది.
అనుపమ నటించిన క్రేజీ కళ్యాణం సినిమా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొంటుంది. నేడు మీడియాతో మాట్లాడగా అనుపమ ఆ విషయంపై, తన పెళ్లిపై స్పందించింది.
Also Read : Anupama Parameswaran : పెళ్లి కాకుండానే పిల్లలు కావాలి.. అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్..
అనుపమ మాట్లాడుతూ.. మీరు విన్నవి నిజమే. వాటి నుంచి నేను బయటకు వచ్చేసాను. దానికోసం కొన్ని థెరపీలు చేసుకున్నాను. మైండ్ లో నుంచి అన్ని తీసేసా. ప్రస్తుతం ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అందుకే ప్రమోషన్స్ లో కూడా చాల యాక్టివ్ గా ఉంటున్నాను. అనుపమ 2.0 ని చూస్తారు ఇకపై. ఇప్పుడు పెళ్లి ఆలోచన కూడా లేదు. పెళ్లి విషయంలో మా ఇంట్లో ఫోర్స్ చేయడం కూడా లేదు. నీ ఇష్టం ఎపుడు చేసుకుంటే అప్పుడు చేసుకో, అసలు పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు అని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. వాళ్లకు నేను సంతోషంగా ఉండటం కావాలి. ప్రస్తుతానికి నా ఫోకస్ కెరీర్ మీదే. చేతిలో ఓ ఏడు సినిమాలు ఉన్నాయి. అవి పూర్తి చేయాలి అని తెలిపింది.


