AP Rain Alert : ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో నాలుగురోజులు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ..

Must read

AP Rain Alert

AP Rain Alert : ఏపీలో ఎండల తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న వేళ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

Also Read : Tirumala : తిరుమల వెళ్లే ప్రయాణికులకు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో నో ఎంట్రీ..! భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక సూచన..

ద్రోణి ప్రభావంతో పాటు ఈశాన్య రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

శ్రీకాకుళం, పోలవరం, విశాఖపట్టణం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

నెల్లూరు, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే, గురువారం సాయంత్రం చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. చిత్తూరు, పుత్తూరు, సత్యవేడు, శ్రీసిటీ, తడ పరిసర ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. వర్షాలతోపాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అంచనా వేసింది.

వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, భారీ హోర్డింగ్ లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు వర్సాలు, ఈదురుగాలుల సమయంలో పొలాల్లో, చెట్ల కింద ఉండొద్దని.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.

- Advertisement -spot_img

More articles

spot_img
- Advertisement -spot_img

Latest article

error: Content is protected !!