మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన ‘ఇరుముడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఆదరణ బాక్సాఫీస్ వసూళ్లలోనూ కనిపించడంతో సినిమా సుదీర్ఘమైన థియేట్రికల్ రన్‌ను కొనసాగించింది.ఇప్పటికే 25 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ‘ఇరుముడి’కి భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడైనట్లు చిత్రబృందం వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 1.41 కోట్ల టికెట్లు విక్రయమైనట్లు సమాచారం. వరల్డ్‌వైడ్‌గా రూ.240 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సినిమా ట్రేడ్ వర్గాల నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ వీకెండ్ నాటికి రూ.250 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా సినిమా అందుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
థియేటర్లలో సినిమా రన్ ఇంకా కొనసాగుతుండగానే ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్‌పై ఆసక్తి పెరిగింది. సినిమా విడుదలకు ముందే ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి దక్కించుకున్నట్లు సమాచారం. నిర్మాతలు, ఓటీటీ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం నాలుగు వారాల థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత సినిమాను స్ట్రీమింగ్కు తీసుకురావాల్సి ఉందని తెలుస్తోంది.అయితే ‘ఇరుముడి’కి థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ ఇంకా కొనసాగుతుండటంతో ఓటీటీ విడుదలను మరికొంత కాలం వాయిదా వేయాలని నిర్మాతలు భావించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాకు స్థిరమైన వసూళ్లు వస్తున్నాయని, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లలోనూ టికెట్ సేల్స్ కొనసాగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమాను మరో రెండు వారాలు ఆలస్యంగా స్ట్రీమింగ్ చేయాలని నిర్మాతలు నెట్‌ఫ్లిక్స్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఒప్పందం ప్రకారం నిర్ణయించిన తేదీకి అనుగుణంగానే స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ నెల 18 నుంచి ‘ఇరుముడి’ ఓటీటీలోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.థియేటర్లలో మంచి రన్ కొనసాగుతున్న సమయంలోనే ఓటీటీలోకి రావడం సినిమాకు ఒకవైపు సర్ప్రైజ్గా మారితే.. మరోవైపు ఓటీటీ ప్రేక్షకులకు మాత్రం ఇది గుడ్న్యూస్గా మారింది. ముఖ్యంగా థియేటర్లలో సినిమాను చూడలేకపోయిన రవితేజ అభిమానులు, మూవీ లవర్స్ ఇప్పుడు ఇంటి నుంచే సినిమాను చూసే అవకాశం పొందనున్నారు.‘ఇరుముడి’ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు భాషతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. దీంతో పాన్-ఇండియా స్థాయిలో ఓటీటీ ప్రేక్షకులను కూడా ఈ సినిమా చేరుకోనుంది.థియేటర్లలో మంచి వసూళ్లు, సుదీర్ఘమైన రన్‌ను సొంతం చేసుకున్న ‘ఇరుముడి’కి ఓటీటీలో ఎలాంటి స్పందన లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. థియేట్రికల్ విజయాన్ని ఓటీటీ వేదికపై కూడా రవితేజ సినిమా కొనసాగిస్తుందా అనేది చూడాలి.


